బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఎన్టీఆర్… రాజమౌళి అడ్డు పడుతాడా ?

391
junior NTR to host Bigboss 3

బిగ్ బాస్ సీసన్ 3 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తాడని గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. RRR మూవీ కోసం సంవత్సరం పాటు డేట్స్ ఇచ్చేసాడు ఎన్టీఆర్. సంవత్సరం తరువాత కూడా తారక్ ఇంకో సినిమా చేస్తాడనే నమ్మకం లేదు. ఎందుకంటే జక్కన్న సినిమా ఎప్పుడు అయిపోతుందో ఆయనకే తెలియదు.
జక్కన్న చేతిలో రిమోట్ ?

అరవింద సమేత షూటింగ్ వల్ల బిగ్ బాస్ రెండవ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించలేక పోయాడు.
కానీ బిగ్ బాస్ సీజన్ 3 కి ఎన్టీఆర్ అందుబాటులో ఉంటాడని, కేవలం శని ఆదివారాల్లోనే ఎన్టీఆర్ డేట్స్ కావాలి కనుక జక్కన్న ఒప్పుకుంటే హోస్ట్ గా వ్యవహరిస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ తో పాటు డేట్స్ ఇచ్చిన మిగిలిన నటుల డేట్స్ కూడా అడ్జస్ట్ చెయ్యాల్సి వస్తుంది. ఈ తతంగం అంతా రాజమౌళి కి నచ్చదు, అందుకే RRR సినిమా అయ్యే వరకు తారక్ ని ఎక్కడికి పంపించేది లేదని జక్కన్న నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. బిగ్ బాస్ సీసన్ 3 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాలని అభిమానుల కోరిక. మరి ఏమవుతుందో ఏమో ఎదురు చూడాలి.