శ్రీముఖిని నేకెడ్ ఫోటో అడిగిన నెటిజన్… దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన బ్యూటీ

341
Sreemukhi stunning reply to netizen

బుల్లితెర రాములమ్మగా ఆకట్టుకుంటున్న శ్రీముఖి వెండితెరపై అలరిస్తూనే సినిమాల్లో కూడా మెరుస్తోంది.

బిగ్ బాస్ లో రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి హీటెక్కించే ఫొటోలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

ఇప్పటికే జులాయి, నేను శైలజ, జెంటిల్‌మన్, బాబు బాగా బిజీ లాంటి సినిమాల్లో నటించిన శ్రీముఖి ప్రస్తుతం పాలసీ చిత్రాలతో బిజీగా ఉంది.

‘క్రేజీ అంకుల్స్’ అనే మూవీతో పాటు బాలీవుడ్ లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ రీమేక్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఇటీవల గోవా టూర్ కు వెళ్లిన శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నెటిజన్స్ కు “మీరు ఏ ఫొటోలు అడిగిన పంపిస్తాను. అడ‌గండి” అని చెప్పేసింది.

దీంతో ఓ నెటిజన్ ఏకంగా ఆమెను నగ్నంగా ఉన్న ఫోటో పంపమని కోరాడు. అయితే శ్రీముఖి ఏమాత్రం కోపగించుకోకుండా అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.

ఇంతకీ శ్రీముఖి అతనికి ఏం పంపిందంటే… నెకెడ్, నగ్నం అంటూ ఆర్జీవీ సినిమా పోస్టర్‌ను పంపింది. ఆమె చాకచక్యంగా వ్యవహరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.