నిద్రలో లేచి నడిచే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. కొంత మంది మోసాలు చేయడానికి అలా నటిస్తుంటారు. అది వేరే విషయం.
అయితే నిద్రలో నడిచి నడవటం చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణం మీదికి తెస్తుంది. ఓ వ్యక్తి నిద్రలో నడుచుకుంటూ వెళ్లి మేడపైనుంచి కింద పడి మరణించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబైలోని కలినా ప్రాంతంలో ఉండే వజ్రాల కార్మికుడికి నిద్రలో నడిచే అలవాటుంది. ఈ అలవాటు అతడి మరణానికి కారణమైంది.
రెండ్రోజుల క్రితం ఆ వజ్రాల కార్మికుడు తెలవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్రలో నడుస్తూ తన ఇంట్లో అటూ ఇటూ తిరిగాడు. ఆ నిద్ర మత్తులోనే తన ఫ్లాట్ కిటికి తెరిచి ప్రమాదవశాత్తు నాలుగవ అంతస్తు నుంచి కింద పడి మరణించాడు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు మృతుడు నిద్రలో నడిచే అలవాటుందని తెలిసింది. చనిపోయిన వ్యక్తి చిన్న వయస్కుడు. 25 ఏళ్లు ఉంటాయోమే.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని వజ్రాల వ్యాపారి వద్ద ఇతను పనిచేస్తున్నడు. ముంబై కలినా ప్రాంతంలోని హైరైజ్ బిల్డింగ్‌లో మరో ముగ్గురితో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాడు.
అయితే అతడికి నిద్రలో నడిచే అలవాటు ఉండటం వల్ల బుధవారం తెల్లవారుజామున స్లీవ్ చేసి కన్నుమూశాడు. అతను స్లీప్ వాక్ చేస్తున్నప్పుడు రూమ్‌లో ఉండే మిగతా ఇద్దరు గాఢ నిద్రలో ఉండటం వల్ల తమ స్నేహితుని స్లీప్ వాక్‌ను గమనించలేదు.
దీంతో అతడు ఆ కిటికీకి గ్రిల్స్ కూడా లేకపోవడం వల్ల కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు.
రంగంలోకి దిగిన వకోలా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. అయితే మృతుడికి నిద్రలో లేచి నడిచే అలవాటుందని పోలీసులకు తమ విచారణలో తెలిసింది.
నెలలో ఒకట్రెండుసార్లు అర్ధరాత్రి సమయంలో లేచి స్లీప్ వాక్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఈ ఘోరం జరిగినట్టు భావించారు.
ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. మృతుడు స్లీప్ వాక్ చేసే సమయంలో ఫ్లాట్‌లో ఉన్న వారు గాఢ నిద్రలో ఉన్నారని.. కిటికీకి ఉన్న కర్టన్ తమ మీద పడటంతో వారికి మెలకువ వచ్చిందని చెప్పారు.
మెలకువ రాగానే కిటికీ తెరచి ఉండటం చూసి వారు ఖంగారు పడ్డారని, కిందికి తొంగి చూసి షాక్ తిన్నారని తెలిపారు. యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతుందని వకోలా పోలీసులు తెలిపారు.