ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో జరిగిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి ఐపీఎల్ వేలంలో స్టార్స్ కిడ్స్ కూడా కన్పించడం విశేషం.
ఈ వేలంలో షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్, బాలీవుడ్ బ్యూటీ జూహీచావ్లా కూతురు జాన్వీ మెహతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అక్కడ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరిస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టు..
బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్న తమిళనాడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ షారుఖ్ ఖాన్‌ను రూ. 5.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ప్రీతి జింటా క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగానే… షారుక్‌ను మేం కొనేశాం అని కోల్‌కతా టేబుల్ దగ్గర ఉన్న ఆర్యన్‌ను చూస్తూ సరదాగా అన్నారు. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
బ్రేక్‌లో నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రీతి జింటా వీడియో కాల్ మాట్లాడారు. ఈ ఫొటోను పంజాబ్ కింగ్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నారు.
Guess who @realpreityzinta is talking to?🤔
HINT: He’s a ‘King’ too 🎞️😉#SaddaPunjab #IPLAuction2021 #PunjabKings pic.twitter.com/7MNbdZxgBa
— Punjab Kings (@PunjabKingsIPL) February 18, 2021
అంతేకాదు పంజాబ్ కింగ్స్ షారుఖ్ ఖాన్ జిఫ్ ఇమేజ్‌ను ట్వీట్ చేస్తూ “షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్” అని పేర్కొంది.
Shahrukh Khan is a Punjab King! 😍#SaddaPunjab #PunjabKings #IPLAuction2021 pic.twitter.com/IMGW9DL6Qv
— Punjab Kings (@PunjabKingsIPL) February 18, 2021