సింగం తో లెజెండ్ డైరెక్టర్ సినిమా – ఇక మామూలుగా ఉండదు…!

240
singam surya telugu straight film soon

సూర్య సినిమాలు కోలీవుడ్ లో ఎంత ఫెమాసో టాలీవూడ్ లోనూ అంతే ఫేమస్.
కోలీవుడ్ స్టార్ కథానాయకుడు సూర్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే స్పెషల్ గా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మిళంతో పాటు తెలుగులోనూ చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ స్టార్ హీరొ ఇప్ప‌టివ‌ర‌కు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. తెలుగులో మూవీ చేసేందుకు తనకు సరిపోయే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నడు,

సూర్య కోసం మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను యాక్ష‌న్ స్క్రిప్ట్ రెడీ చేశాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. బోయ‌పాటి ఈ క‌థ‌ను మొదట ప్ర‌భాస్ కోసం రెడీ చేసుకోగా..ఇపుడు సూర్య చేతుల్లోకి ఈ ప్రాజెక్టుని తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అయితే బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య సినిమా రిలీజ్ త‌ర్వాత వ‌చ్చిన రిజల్ట్ బ‌ట్టి సూర్య బోయపాటితో సినిమాను అనౌన్స్ చేస్తాడేమోనంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను సూర్య‌తో తెలుగు మరియు త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకుంటునట్లు సమాచారం . మ‌రి ఈ క్రేజీ కాంబినేష‌న్ తెర‌పైకి వ‌స్తుందా..? లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..