నెటిజన్లకు శృతిహాసన్ గట్టి కౌంటర్

183
Shrutihaasan counter to netizens

సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ గురించి జనాలకు చాల ఆసక్తి.. ఎప్పుడేం పుకార్లు దొరుకుతాయా అని చూస్తానే వుంటారు. అయితే ఈ విషయం పై శ్రుతి హాసన్ మండిపడ్డారు,

ప్రతిఒక్కరికీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయని నటి శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ ప్రస్తుతానికి అయితే తను వృత్తిపరమైన జీవితంపై ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నాను, కాబట్టి అందరూ దాని గురించే మాత్రమే మాట్లాడితే బాగుంటుందని ఆమె అన్నారు.

దాదాపు మూడు ఏళ్ల విరామం తర్వాత శ్రుతి హాసన్ ‘క్రాక్‌’తో తెలుగులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.

‘సలార్‌’ షూటింగ్ లో పాల్గొన్న శ్రుతిహాసన్‌ తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ‘సలార్‌’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నాను. ఇప్పటి వరకూ నేను నటించిన పాత్రలతో పోలిస్తే.. ఈ మూవీ లో నా క్యారెక్టర్‌ చాలా డిఫెరెంట్ గా ఉండనుంది.

‘సలార్‌’ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. మంచి మనస్సున్న వర్క్ పట్ల పూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ప్రభాస్ అని తెలిపారు.

గత కొన్నిరోజుల నుండి ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికా, శ్రుతి ఇద్దరు లవ్ ఉన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

అలాంటి పుకార్ల పై ఆమె స్పందిస్తూ.. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అసలు నాకిష్టం లేదు. ప్రస్తుతం నా ఫోకస్‌ మొత్తం వర్క్ మీదనే. కాబట్టి ఎదుటివారు కూడా నా వర్క్‌పైనే ఫోకస్‌ చేస్తే బాగుంటుంది’ అని ఆమె నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇప్పటికి అయితే శ్రుతిహాసన్ ‘వకీల్‌సాబ్‌’, ‘సలార్‌’, ‘పిట్టకథలు’ ప్రాజెక్ట్‌లు చేస్తు బిజీ గా ఉన్నారు.