ఏపీలో పది పరీక్షల షెడ్యూల్ విడుదల!

121

ఏపీలో పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించారు.

సామాన్యశాస్త్రానికి మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. సైన్సులో ఒక్కో పేపరుకు 50 మార్కులు కేటాయించారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు జూన్ ఐదో తేదీ వరకు క్లాసులు జరగనున్నాయి. మే 3 నుంచి 10 వరకు ఇతర తరగతులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల అనంతరం సెలవుల తర్వాత జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.