హీరోయిన్ షాలిని రీఎంట్రీ ?

604
Shalini Ajith Reentry with Ponniyin Selvan?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన షాలిని అజిత్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం “పొన్నియ‌న్ సెల్వ‌న్” మూవీలో షాలిని ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “పొన్నియ‌న్ సెల్వ‌న్” చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్, విక్ర‌మ్‌, కార్తీ, జ‌యం ర‌వి, త్రిష త‌దిత‌ర నట దిగ్గజాలు నటిస్తున్నారు.

బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని తనదైన శైలిలో నటిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందారు.

గ్లామర్ కు దూరంగా ఉంటూనే పలు చిత్రాల్లో సహజ నటన కనబరిచిన షాలిని ఎంతో మంది అభిమానుల మనసును దోచుకున్నారు.

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడే హీరో అజిత్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. షాలిని చివరగా నటించిన చిత్రం “పిరియాద వ‌రం వేండుం”.

కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు షాలిని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త‌లు వస్తున్నాయి.