మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ “విజేత” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంతో పర్వాలేదన్పించిన కళ్యాణ్ ఆ తరువాత “సూపర్ మచ్చి” చిత్రంలో నటించారు.
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై “సూపర్ మచ్చి” చిత్రం పులివాసు దర్శకత్వంలో తెరకెక్కింది. రిజ్వాన్, ఖుషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచితారామ్ హీరోయిన్ గా నటిస్తుంది.
నేడు కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్బంగా “సూపర్ మచ్చి” నుంచి పోస్టర్ విడుదల చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
అంతేకాదు కళ్యాణ్ పుట్టినరోజు సందర్భముగా “సూపర్ మచ్చి” చిత్రబృందం “మీనమ్మ” అనే లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు.
“సూపర్ మచ్చి” లిరికల్ వీడియో మంచి బీట్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా “మీనమ్మ” లిరికల్ వీడియోను వీక్షించండి.
కళ్యాణ్ దేవ్ మూడవ చిత్రం ‘కిన్నెరసాని’ సినిమా నుంచి ఈరోజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ వీడియో, “ఫస్ట్ గ్లింప్స్”ను విడుదల చేశారు.
ఫస్ట్ గ్లింప్స్ లో కళ్యాణ్ న్యూ లుక్ బాగుంది.