సల్మాన్ ఖాన్ కు అరుదైన గౌరవం

261
Salman Khan's painting to be displayed alongside Raja Ravi Varma

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు ఓ అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో బెంగళూరులో జరిగే ఓ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో సల్మాన్‌ పెయింటింగ్‌లను ప్రదర్శించనున్నారు.

అది కూడా ప్రముఖ భారత చిత్రకారుడైన రాజా రవి వర్మ పెయింటింగ్‌ చిత్రాలతో పాటు ఆయన‌ పెయింటింగ్‌ను కూడా ప్రదర్శించనున్నారు.

సల్మాన్‌ సంతకం చేసిన మదర్‌ థెరిస్సా పెయింటింగ్‌ను ఈ ఇమ్మోర్టల్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు.

దీనిపై భాయిజాన్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో శుక్రవారం పంచుకున్నాడు.

“రాజా రవి వర్మ, అబనీంద్రనాథ్‌ ఠాగూర్‌, వీఎస్‌ గైతోండే వంటి గొప్ప కళాకారుల మధ్య నా పెయింటింగ్‌ ప్రదర్శించబోతుండటం నిజంగా విశేషం.

ఈ విషయాన్ని గ్రహించడం కాస్త ఇబ్బందిగా ఉంది. నిజంగా ఇది అరుదైన గౌరవం. అందరికి ధన్యవాదాలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

పెయింటింగ్‌ అంటే ఆసక్తి అన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లో ఆయన వేసిన కొన్ని పెయింటింగ్స్‌ను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

కాగా సల్మాన్‌ ఖాన్ ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ తో పాటు మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ’ సినిమాల్లో నటిస్తున్నాడు.