కొవిడ్ వ్యాక్సిన్ @ 250

183

క‌రోనా మ‌రోసారి విజృంభిస్తున్న స‌మ‌యంలో వాక్సిన్ ప్ర‌తి ఒక్క‌రికి అవ‌స‌రం. అయితే ఈ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఒక నిర్దిష్ట ధ‌ర నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం అందుతోంది.

వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ. 250కి అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలో దీన్ని అధికారికంగా ప్రకటించనున్న‌ట్టు స‌మాచారం.

మార్చి 1 నుంచి మలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

65 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక రుగ్మ‌త‌ల‌తో బాధ పడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఫిబ్రవరి 24న తెలిపారు.

ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయ‌న చెప్పారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ నిమిత్తం నామ‌మాత్రపు ఫీజులనే వసూలు చేస్తామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.

సిరంజీలు, వ్యాక్సిన్ ఇవ్వడానికి అవసరమైన మానవ వనరుల ఖర్చులు మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది.

250 రూపాయలకుగాను రూ.100 సర్వీస్ ఛార్జీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

టీకా పంపిణీలో ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుని 28 రోజులు పూర్త‌యిన‌ వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు కూడా అందిస్తున్నారు.