సైకిల్ తొక్కుతున్న సాయిప‌ల్ల‌వి కొత్త లుక్ ‘విరాటప‌ర్వం’

419
sai pallavi new movie

రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం 1992’. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. రానా నక్సలైట్ గా, ఆ తర్వాత పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లు టాక్. చిత్రంలో వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌.

ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ సోష‌ల్ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రం ధ‌రిప‌ల్లి అనే గ్రామంలో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. అయితే తొలి షెడ్యూల్‌లో సాయి ప‌ల్ల‌వి షూటింగ్‌లో పాల్గొన‌గా, ఆమెకి సంబంధిచిన ఓ పిక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. పల్లెటూరి పిల్ల‌గా సైకిల్ తొక్కుతున్న సాయి ప‌ల్ల‌వి లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. రెండో షెడ్యూల్ నుండి రానా టీంతో క‌ల‌వ‌నున్నాడు. ఈ చిత్రంలో 1990 నాటి రాజకీయ అంశలని దర్శకుడు ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.