రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 205 ఖాళీ ఇంజినీరింగ్ పోస్టులు

301
jobs in steelplant

ఒడిశాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ మేనేజ్‌మెంట్, జూనియర్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 205

-విభాగాల వారీగా ఖాళీలు..ఎగ్జిక్యూటివ్ పోస్టులు-26. దీనిలో.. డిప్యూటీ మేనేజర్ (బాయిలర్ అండ్ టర్బైన్ ఆపరేషన్)-11, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఫైర్)-6, జూనియర్ మేనేజర్ (సేఫ్టీ)-6, జూనియర్ మేనేజర్ (క్వాలిటీ టెస్టింగ్ అల్ట్రాసోనిక్)-3 ఖాళీలు ఉన్నాయి.

-నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-106. దీనిలో ఫైర్ ఆపరేటర్ ట్రెయినీ-25, ఫైర్‌మ్యాన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ట్రెయినీ-81 ఖాళీలు ఉన్నాయి.

-బాయిలర్ ఆపరేటర్-7 ఖాళీలు

-ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ-47 ఖాళీలు (మెకానికల్-13, మెటలర్జీ-14, ఎలక్ట్రికల్-10, ఎలక్ట్రానిక్స్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్-5

-అటెండెంట్ కమ్ టెక్నీషియన్-19 ఖాళీలు ఉన్నాయి.

పోస్టులవారీగా అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి నేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఫైర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, జూనియర్ మేనేజర్‌కు మెకానికల్/మెటలర్జీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌తోపాటు ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా/పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత. ఫైర్ ఆపరేటర్‌కు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజ్ (నాగ్‌పూర్)చే సబ్ ఆఫీసర్ కోర్సు చేసి ఉండాలి. మిగతా పోస్టులకు మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయస్సు: 2019 జూలై 31 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పేస్కేల్: మేనేజర్ పోస్టులకు రూ. 32,900-58,000/-, మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు రూ. 20,600-46,500/- ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ రూ. 16,800-24,110/-

అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, (ఆపరేటర్ కమ్ టెక్నీషియన్‌కు రూ. 250/-, అటెండెంట్ కమ్ టెక్నీషియన్‌కు రూ. 150/-)
ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 31
వెబ్‌సైట్: www.sailcareers.com