అదిరింద‌య్యా.. ఎన్‌ఫీల్డ్‌

165

ప్ర‌పంచంలోనే అతి పాత మోటార్ సైకిల్ బ్రాండ్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా ఉత్ప‌త్తుల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. ఈ మ‌ధ్య‌కాలంలో యువ‌త ఈ మోటార్ సైకిల్‌పై ఎక్కువ‌గా మోజు పెంచుకుంటున్నారు.

ప్ర‌ముఖ బ్రాండ్‌ల‌లో ఒక‌లైన రెట్రో మోటార్ సైకిల్ రెండేళ్ల క్రిత‌మే ట్విన్ సిలిండ‌ర్ల‌తో కొత్త మోడ‌ల్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. గ‌తంలో ఏ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌కు లేనంత ఆద‌ర‌ణ ఇంట‌ర్‌సెప్ట‌ర్ 650, కాంటినెంట‌ల్ జిటి 650కి ల‌భిస్తోంది.

వీటిల్లో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ట్విన్ సిలిండ‌ర్ల‌తో రూపొందించ‌డ‌మే. క్లాసిక్ 650, బుల్లెట్‌, ఇంట‌ర్‌సెప్ట‌ర్‌, కాంటినెంట‌ల్ జిటి 650లు న్ని మాడిఫికేష‌న్స్‌కు అనుకూలిస్తాయి.

ఇటువంటి వాటిల్లో నూత‌న ప్ర‌యోగం (రీ మోడ‌లింగ్ బైక్‌) గురించి చూస్తే.. గోబిన్ వ‌ర్క్స్ గ్యారేజీలో ఓ టీవీ షో కొసం దీనిని మాడిఫై చేశారు. కాంటినెంట‌ల్ జిటి 650లో మార్సులు చేసి లుక్‌ను పూర్తిగా మార్చేశారు.

ఇందులో ఉన్న ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనకు కావాల్సిన మార్పులు ఏవైనా సింపుల్ గా త్వరగా చేసేయొచ్చు. దీని లుక్ చూస్తే రేసింగ్ బైక్ గుర్తుకొస్తుంది.

కార్బన్ ఫైబర్ మెటేరియల్‌తో బైక్ రెడీ అయింది. ఇక దీని ఫ్యూయెల్ ట్యాంక్ ను కూడా రేస్ లిఫ్ట్ క్యాప్ లాగే డిజైన్ చేశారు. మోనో యూనిట్ను మార్చి రెండు షాక్ అబ్జార్బర్లు ఫిట్ చేశారు.

వెనక చక్రానికి మోనోషాక్ కోసం స్విన్ గార్మ్‌ను ఫ్యాబ్రికేట్ చేయించారు. అలా ముందు వెనుక సస్పెన్షన్‌కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్‌కు జీపీ స్టైల్ క్విక్ రిలీజ్ యాక్సిల్‌తో ఉంది.

ఈ చక్రాలు కార్బన్ ఫైబర్ యూనిట్స్ అన్నమాట. నికెల్ ప్లేట్‌లతో పాటు గాల్ఫర్ డిస్క్‌లు ప్లాన్ చేసి బ్రేక్ సిస్టమ్ సూపర్‌గా సిద్ధం చేశారు.

వెనుక వైపు విశాలమైన టైర్‌తో మార్చారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, హ్యాండిల్ బార్స్, హైడ్రాలిక్ క్లచ్ బైన్‌ను పట్టుకున్నా.. చూసినా స్పెషల్ ఫీలింగ్ తెప్పిస్తున్నాయి.