పాప్ సింగర్ అర్ధనగ్న ఫోటోలో వినాయకుడు… వివాదాస్పదం

233
Rihanna goes topless wearing Ganesh pendant

ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ రిహానా మరోసారి భారతీయులు ఆగ్రహానికి గురవుతున్నారు.

హిందువుల ఆది దైవం విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని మెడలో ధరించి అర్ధనగ్నంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాట్ టాపిక్ అయ్యారు.

ఈ ఫొటోలో రిహానా ఊదా రంగుతో కూడిన చిన్న నిక్కరు, ఆభరణాలు ధరించారు. మెడలో వేసుకున్న దండకు విఘ్నేశ్వరుడి లాకెట్ ఉండడం గమనార్హం.

ఈ అర్ధనగ్న ఫొటోలో గణేషుడి లాకెట్‌ను వాడటంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆమె మెడలో గణేషుడి బొమ్మ కనిపించడంపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కాదమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కాదమ్ ఈ విషయంపై స్పందిస్తూ…

“మనకెంతో ఇష్టమైన హిందూ దైవం గణేషుడిని రిహానా నిస్సుగ్గుగా ఎగతాళి చేయడం చూస్తే భయమేస్తోంది. దీన్ని బట్టి రిహానాకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అస్సలు అవగాహన లేదని అర్థమవుతోంది.

ఇప్పటికైనా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆమె నుంచి సహాయం తీసుకోవడం మానేస్తారని ఆశిస్తున్నాను.

వాళ్లు ఆమెను విమర్శిస్తారో లేదంటే ప్రియమైన దైవం గణపతి కంటే అధికారమే పెద్దది అని భావిస్తారో చూడాలి” అని ట్వీట్ చేశారు.