బాద్‌షా “టాప్ టక్కర్” ఆల్బమ్ లో రష్మిక

273
Rashmika Mandanna in Top Tucker Teaser

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న ఓ బాలీవుడ్ వీడియో ఆల్బమ్ లో మెరిసింది. “టాప్ టక్కర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ ఆల్బమ్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

పాపుల‌ర్ హిందీ సింగర్, రాపర్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ ఈ పాటను పాడారు.

ఈ టీజర్ లో బాద్‌షా, యువన్ శంకర్ రాజాలతో పాటు రష్మిక మందన్న కూడా ఉంది.

“టాప్ టక్కర్” ఆల్బమ్ పూర్తి వీడియో త్వరలోనే విడుదల కానుంది. అయితే రష్మిక బాలీవుడ్ లో ఇలాంటి వీడియో ఆల్బమ్ లో నటించడం ఇదే మొదటిసారి.

దీనిపై రష్మిక స్పందిస్తూ “మొద‌టిసారి నేనిలాంటి వీడియో చేశాను. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతుంది. ఇక ఏ వేడుకలోనైన ఈ పాటే వినిపిస్తుందని నమ్ముతున్నాను.

అంతేకాదు ఈ పాటలో అద్భుత‌మైన డ్యాన్స్ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక రష్మిక ఈ వీడియోలో అందంగా కన్పిస్తోంది. మీరు కూడా “టాప్ టక్కర్” టీజర్ ను వీక్షించండి.