అక్కినేని హీరోతో “ఉప్పెన” హీరోయిన్ ?

449
Krithi Shetty to Romance Akhil Akkineni ?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తరువాత అఖిల్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు.

అఖిల్ ఇటీవల ఎక్కువగా హార్స్ రైడింగ్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో సురేందర్ రెడ్డి సినిమా కోసమే అఖిల్ హార్స్ రైడింగ్ లో స్పెషల్ గా నైపుణ్యం సంపాదిస్తున్నాడని అనుకుంటున్నారు.

కాగా ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే “ఉప్పెన” ఫేమ్ కృతి శెట్టి… అఖిల్ కు జోడిగా నటించనుందనే వార్త విన్పిస్తోంది.

“ఉప్పెన” విడుదలకు ముందే కృతికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అఖిల్ సినిమాలోనూ కృతిని హీరోయిన్ గా ఖరారు చేశారని తెలుస్తోంది.

ఇక భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రం జూన్ 19న విడుదల కానుంది.

ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా… గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అఖిల్ కు ఈ చిత్రంతో హిట్ ఖాయమని భావిస్తున్నారు అక్కినేని అభిమానులు.