కన్నడ భామ రష్మిక ప్రస్తుతం ఫామ్‌లో ఉంది. ఒకవైపు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తుంది. మహేష్ బాబు- అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది రష్మిక. మరో వైపు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ చిత్రంలోను కథానాయికగా నటించింది రష్మిక. జులై 26న ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ సినిమాను నాలుగు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. ట్రైలర్‌లో రష్మిక లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే నడించింది. ఓ ఇంటర్వ్యూలో ముద్దు సన్నివేశాలలో నటించడం గురించి వివరించింది. కోపం, బాధ, తరహాలోనే ముద్దు. అది కూడా ఓ ఎమోషనే. నటిగా దాన్ని కూడా పండించాలి. ముద్దు సన్నివేశాలని నటన నుండి వేరుగా చూడలేమంటూ పేర్కొంది రష్మిక.
పారితోషికం పెంచేసిన రష్మిక
గీత గోవిందం’ హిట్ తర్వాత కథానాయిక రష్మిక పారితోషికం పెంచేశారని తెగ ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయాన్ని తాజా సమావేశంలో రష్మికను మీడియా అడిగింది. దీనికి ఆమె సరైన సమాధానం ఇచ్చారు. ‘పారితోషికం పెంచడం సర్వసాధారణమైన విషయం. కొన్నేళ్ల నుంచి ఈ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నా. నటిగా నా ఎదుగుదలలో పారితోషికం కూడా ఓ భాగమే’ అని జవాబిచ్చారు. రష్మిక తొలుత ఓ సినిమాకు రూ.40 లక్షలు పారితోషికంగా తీసుకునేవారు. తర్వాత ప్రాజెక్టును బట్టి రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ తీసుకుంటున్నారు. ఆమె తన కొత్త కన్నడ సినిమా ‘పొగరు’కు రూ.64 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది.