ఐటీఐ, పాలిటెక్నిక్ అభ్యర్ధులకు సౌరశక్తి కోర్సుల్లో.. ఉచిత శిక్షణకు దరఖాస్తులు

951

బేగంపేట బ్రాహ్మణవాడి స్వామి రామనంద తీర్థ మెమోరియల్ కమిటి కేంద్రంలో సురభి ఎడ్యుకేషనల్ సొసైటి ద్వారా సౌరశక్తి కోర్సు, సూర్యమిత్రలో ఉచితంగా శిక్షణ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సంస్థ ప్రొగ్రాం డైరక్టర్ శేఖర్‌మారం రాజు తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న శిక్షణ తరగతుల్లో ప్రవేశానికి ఐటీఐ( ఎలక్ట్రీషియన్, మెకానిక్) పాలిటెక్నిక్( ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్) ఇంటర్మీడియెట్ (ఒకేషనల్, ఎలక్ట్రికల్) కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతుల ద్వారా సౌరశక్తికి సంబంధించిన అన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఎంపికైన అభ్యర్ధులకు ఉచిత భోజనం, వసతులు, స్టడీ మేటీరియల్స్‌కు అందించనున్నట్టు తెలిపారు. కోర్సులు పూర్తి చేసుకున్న వారికి భారత ప్రభుత్వం నిర్వహించే పరీక్ష అనంతరం ధృవపత్రాన్ని అందిస్తామని అన్నారు. వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా అందించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9010191007, 99123871210 ను సంప్రదించాలని సంస్థ నిర్వహకులు తెలిపారు.