సంగీత ప్రియుల‌ని అలరిస్తున్న ఉండిపో.. మెలోడి సాంగ్‌

229

హీరో రామ్‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రంలో రామ్ పూర్తిగా డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం రామ్‌, పూరీ కెరియ‌ర్‌కి కీలకం కానుంది.. ఈ చిత్రంపై జ‌నాల‌లో ఆస‌క్తిని క‌లిగించేందుకు వినూత్న ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు మేక‌ర్స్. ఈ క్ర‌మంలో తాజాగా చిత్రం నుండి ఉండిపో.. ఉండిపో అంటూ సాగే సాంగ్ విడుద‌ల చేశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, రమ్య బెహ్రా ఆల‌పించిన ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. సాంగ్ చాలా బాగుంద‌ని, మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఎనర్జిటిక్‌ రామ్‌ హీరో స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 18న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలు జ‌రుపుకుంటుంది.