ఈ మధ్యకాలం లో వినూత్న రీతిలో ట్రెండ్ అయిన పదం #RVRG . అసలు ఈ #RVRG అంటే ఏమిటంటే “రాజావారు రాణిగారు” అని అర్థం. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా చూడకుండా, చిన్న సినిమాలను కూడా విజయవంతం చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. వైవిధ్యంతో కూడిన సినిమాలు వచ్చిన ప్రతిసారీ ఈ విషయం ప్రూవ్ అయ్యింది. అదే కోవలో ‘రాజావారు రాణిగారు’ అనే సినిమా రాబోతుంది.
వెంకటాపురం అనే గ్రామంలో ఉన్న ఇద్దరు ప్రేమికుల కథను ‘రాజావారు రాణిగారు’ పేరుతో తెరకెక్కించారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నేపథ్య సంగీతం ఇప్పటికే జనాన్ని ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి వారి జీవితంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో.. ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ నిర్మాత మనోవికాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా , జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ‘రాజావారు రాణిగారు’రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.
కెమెరా : విద్యా సాగర్, అమర్ దీప్, ఎడిటింగ్ : విప్లవ్, మ్యూజిక్ : జై క్రిష్, లిరిక్స్ : భరద్వాజ్, రాకేందు మౌళి, దర్శకత్వం: రవికిరణ్ కోలా, ప్రొడ్యూసర్స్ : మనోవికాస్, మీడియా 9