రాజశేఖర్ 92వ చిత్రం ప్రకటన… ఆసక్తికరంగా థీమ్ పోస్టర్

150
Rajashekar 92nd Movie Announcement

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 92వ చిత్రంపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ఆఫ్ బీట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, ఎస్ ఒరిజినల్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ‘గతం’ ఫేమ్ కిరణ్ కొండమడుగుల దర్శకత్వంలో రాజశేఖర్ కొత్త చిత్రం రూపొందనుంది.

‘గతం’ నిర్మాతలు భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు, రాజశేఖర్ కుమార్తెలు శివాని-శివాత్మిక సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

శనివారం ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఇంగ్లీష్ డెయిలీ పేపర్‌పై కూలింగ్‌ గ్లాస్‌, గన్‌, బుల్లెట్స్‌, సిగార్‌, మందుగ్లాసుతో ఉన్న ఈ పోస్టర్‌ను చూస్తుంటే మరోసారి రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించనున్నట్టు అర్థమవుతోంది.

ప్రస్తుతం రాజశేఖర్ “శేఖర్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత తన 92వ చిత్రం షూటింగ్ లో జాయిన్ కానున్నారు రాజశేఖర్. ఆగష్టులో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.

కాగా రాజశేఖర్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత రాజశేఖర్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇటీవలే రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా 91వ చిత్రం ప్రకటన వెలువడింది.