రానా బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన రాజ్ తరుణ్

365
Rana Banner

ఆరంభంలో వరుస విజయాలను అందుకున్న రాజ్ తరుణ్, ఆ తరువాత సరైన కథలను ఎంచుకోకపోవడం వలన తగిన ఫలితాలనే అందుకున్నాడు. ఆయన సక్సెస్ అనే మాట విని చాలా కాలమే అయింది. వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథల కోసం వెయిట్ చేస్తూ ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల ఆయన దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా చెప్పుకున్నారు.

ఇక రానా సొంత బ్యానర్లోను ఒక సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనేది తాజా సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి తెలుగు .. హిందీ భాషల్లో ఓ మాదిరి బడ్జెట్ లో సినిమాలు చేయడానికి రానా రంగంలోకి దిగి కొంతకాలమైంది. తెలుగు వెర్షన్ కోసం రాజ్ తరుణ్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కోసం హీరోను ఎంపిక చేయవలసి వుందట. వేసవి తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.