రైల్వే ‘గ్రూపు-డీ’ దరఖాస్తు తేదీ పొడిగింపు

381
railway-group-d-recruitment-2018-last-date-application-extended

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) గ్రూపు-డీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు తేదీలను రైల్వే శాఖ పొడిగించింది. గతనెలలో 62,907 ఆర్‌ఆర్‌బీ గ్రూపు-డీ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ దేశవ్యాప్తంగా రైల్వే మంత్రిత్వ శాఖ (ఫిబ్రవరి 10న) విడుదల చేసిన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ గ్రూపు-డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 12వరకు మాత్రమే గడువు ఉంది. అయితే తాజాగా రైల్వే శాఖ దరఖాస్తు తేదీ గడువును ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది భారత రైల్వేలో కొన్నివేల పోస్టులను భర్తీ చేసేందుకు భారత రైల్వే రిక్రూట్‌మెంట్ (ఆర్‌ఆర్‌బీ) బోర్డు పరీక్షలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని రైల్వేశాఖల్లో ట్రాక్‌మన్, హెల్పర్స్, గేట్‌మన్, పాయింట్స్ మన్, లెవర్‌మన్ సహా పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నంచి దరఖాస్తులు కోరుతోంది. ఇప్పటివరకూ రైల్వే గ్రూపు-డీ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.



ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 10, 2018
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 31, 2018
ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: మార్చి 31, 2018
ఎస్‌బీఐ చలాన్ చెల్లించేందుకు ఆఖరి తేదీ: మార్చి 31, 2018
పోస్టాఫీసు చలాన్ ద్వారా చెల్లించేందుకు ఆఖరి తేదీ: మార్చి 29, 2018
గ్రూప్-డీ పరీక్ష.. తాత్కాలిక తేదీలు : ఏప్రిల్/మే (అధికారిక పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది)

2018 విద్యార్హతలు.. : 10వ తరగతి, ఐటీఐ తోపాటు సంబంధిత ట్రేడ్ రంగాల్లో నేషనల్ జాతీయ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ (ఎన్‌ఎసీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు పరిమితి: అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సు పరిమితిపై ప్రభుత్వ నిబంధనలనుసరించి సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు కనీస వేతనం నెలకు భత్యాలతో కలిపి (7వ సీపీసీ లెవల్-1) నిబంధన ప్రకారం రూ.18వేలు వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వడ్ కేటగిరీ: రూ.500 ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/మహిళలు/ట్రాన్స్‌జెండర్/ మైనార్టీలు/వెనుబడిన తరగుతులు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు రూ. 250తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.