జబర్దస్త్, పటాస్‌ షోలు నిషేధించాలంటూ….

252
women-unions-demands-ban-jabardasth-patas-shows

మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న జబర్దస్త్‌, పటాస్‌ షోలను నిషేధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పలు షోలలో మహిళలను కించపరిచే విధంగా స్కిట్లు రూపొందిస్తున్నారని ఆరోపించారు.ఈ మేరకు ఏపీ మహిళా సమాఖ్య, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో సంతకాల సేకరణ చేపట్టారు.



ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు. సినిమాలు, టీవీ షోలతో పాటు ఇంటర్నెట్ తదితర సామాజిక మాధ్యమాల్లో అశ్లీలత, అసభ్యకరమైన డైలాగులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అభ్యంతరం వ్యక్తంచేశారు. అశ్లీల వెబ్‌సైట్లను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.