8న హైదరాబాద్‌లో ఆటోల బంద్‌

261
TADJAC-calls-auto-bandh-march-8

ఆటో డ్రైవర్‌పై బోగస్‌ కేసు నమోదు చేసిన టోలీచౌకి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని, ఆటోడ్రైవర్లపై రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఏ అధికారుల వేధింపులను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ జంటనగరాల్లో ఈనెల 8వ తేదీన ఆటో బంద్‌ నిర్వహిస్తున్నామని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ తెలిపారు. హైదర్‌గూడ ఎన్‌ఎస్ఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… డ్రైవర్‌ అక్బర్‌ రూ. 8,025 జరిమానాను వెస్ట్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయంలో కట్టి ఆటో ఇవ్వమని కోరితే.. టోలీచౌకి ట్రాఫిక్‌ సీఐ శివచ్రందబోస్‌ చలానా రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



గోషామహల్‌ ట్రాఫిక్‌ పార్కింగ్‌లో ఉన్న ఆటోపై నానక్‌నగర్‌ వద్ద ఆపి చెక్‌ చేసినట్టు కేసు రాయడం సిగ్గు చేటన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా…అని ప్రశ్నించారు. కేసు లేకుండా ఆటోను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బంద్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ ఆటోడ్రైవర్స్‌ జేఏసీ నాయకులు మారుతిరావు జగ్‌తాప్‌, కె.లక్ష్మీనర్సయ్య, ఎం.ఎ.సలీం, మిర్జారఫతుల్లా బేగ్‌, ఫారుఖ్‌బాయి, లతీఫ్‌ఖాన్‌, ఎం.ఎ.హమీద్‌ఖాన్‌, జె.వంశీ కృష్ణ పాల్గొన్నారు.