చిట్టీల పేరుతో కోట్ల రూపాయల మోసం..

244
chits-scam-came-into-light-in-ramanthapur

చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు ముంచాడని బాధితులు ఆదివారం మధ్యాహ్నం రామంతాపూర్ శాంతినగర్ కాలనీలో వ్యాపారి హనుమంత్‌గుప్తా ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు శ్రీనివాస్‌రెడ్డి, చింతల సత్యనారాయణ ,యాదగిరి, రామకృష్ణలు మాట్లాడుతూ… గత 25 సంవత్సరాలుగా కిరణాషాపు పెట్టి చిట్టీల పేరుతో వ్యాపారం చేసిన హనుమంత్ అందరిని నమ్మించి మోసం చేశాడన్నారు. రూ.10 కోట్ల వరకు చిట్టీలపేరుతో ప్రజలను మోసం చేశాడన్నారు.ఆరు మాసాల నుంచి చిట్టీల డబ్బులు ఇవ్వడంలేదని, అనుమానంవచ్చి అతన్ని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని తెలపారు. గత నెల 7న రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌కు ఫిర్యాదు చేశామని, సీపీ ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసు నమోదు అయిందన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు.