ఎన్‌ఐఆర్‌టీలో ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్లు

353
project technical officer posts in NIRT

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్- 1 పోస్టు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా డిగ్రీలో సైన్స్/సంబంధిత సబ్జెక్టుతో ఉత్తీర్ణతతోపాటు ఐదేండ్లు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లు మించరాదు

ప్రాజెక్టు టెక్నీషియన్ (ఫీల్డ్ వర్కర్) – 16 ఖాళీలు
అర్హతలు: ఇంటర్ (సైన్స్)తోపాటు రెండేండ్ల డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ లేదా ఏడాది డీఎంఎల్‌టీతోపాటు ఏడాదిపాటు ల్యాబ్/ఫీల్డ్ అనుభవం ఉండాలి.
వయస్సు: పై రెండు పోస్టులకు 30 ఏండ్లు మించరాదు
ఫీజు: రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక: చెన్నైలో జూలై 18, 19న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
వెబ్‌సైట్: http://www.nirt.res.in