తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్‌ఈఐఆర్‌బీ) తెలంగాణలోని ఐదు (ఎస్సీ/ఎస్టీ, బీసీ/మైనార్టీ/జనరల్) సొసైటీల్లోని వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 2932
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-960 పోస్టులు
సొసైటీల వారీగా ఖాళీలు:
ఎస్సీ-597,
ఎస్టీ-100,
మైనార్టీ-236,
జనరల్-27
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలు 45 శాతం) మార్కులతో బీఏ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో బీఈడీ లేదా నాలుగేండ్ల బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీతోపాటు టెట్‌లో అర్హత సాధించాలి.
పే స్కేల్: రూ. 28,940-78,910/-
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్-1972 పోస్టులు సొసైటీల వారీగా ఖాళీలు: ఎస్సీ-155, ఎస్టీ-49, బీసీ-472, మైనార్టీ-1280, జనరల్-16
పే స్కేల్: రూ. 31,460-84,970/-
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం(ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలు 45 శాతం) మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో బీఈడీ లేదా నాలుగేండ్ల బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ ఉండాలి.
వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 1200/- (ఎస్సీ/ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు రూ. 600/-)
ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష
రాతపరీక్ష ప్రతి పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ఉంటుంది.
పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లిష్, పేపర్-2లో సంబంధిత సబ్జెక్టులో పెడగాగి, పేపర్-3లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ప్రతి పేపర్‌కు కేటాయించిన సమయం -120 నిమిషాలు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 9 నుంచి
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 8
వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in