గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి. ఇందులో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా రూపొందించిన వైట్ టాప్ పై ఆరెంజ్ కలర్ దుపట్టా దుస్తులలో మెరిసింది.
గత ఏడాది నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక కోసం లాస్ ఏంజెల్స్‌లో అందమైన విల్లాను కొనుగోలు చేశారు. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ దాదాపు రూ.144 కోట్లు (20 మిలియన్లు).
అయితే ఈ ఇంట్లోకి లాక్‌డౌన్ సమయంలో అడుగుపెట్టినట్టు ప్రియాంక తన ఆటోబయోగ్రఫి “అన్‌ఫినిష్డ్”’లో వివరించింది.
📸|| Some pics of Nick and Priyanka from her new book! pic.twitter.com/QzukPkW1MC
— Daily Nick Jonas (@DailyNickJonas) February 8, 2021
ప్రియాంక తన ఆటోబయోగ్రఫీలో కొన్ని సంచలన విషయాలు కూడా రాసుకొచ్చింది. ఓ డైరెక్టర్ తనతో ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో తెలిపింది.
ఐటెం సాంగ్ కోసం లో దుస్తులు కనిపించాలాని ఒత్తిడి తెచ్చాడని, నేను చర్మంలో కలిసి పోయే రంగుతో ఉన్న దుస్తులు ధరిస్తా అన్నా కూడా ఒప్పుకోలేదని పేర్కొంది.
హీరోయిన్‌గా ఎదగాలంటే నీ వక్షోజాలు, పిరుదులు చిన్నవిగా ఉండొద్దు. అమెరికాలో నాకు తెలిసిన డాక్టర్ ఒకతను ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చాడంటూ ప్రియాంక తన ఆటోబయోగ్రఫీలో పేర్కొంది.
ప్రస్తుతం ఈ అమ్మడు ‘టెక్ట్స్ ఫర్ యూ’ అనే హాలీవుడ్ చిత్రం చేస్తుంది. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం.
ఇక ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “సలార్”లో స్పెషల్ సాంగ్ కోసం ప్రియాంకను సంప్రదించినట్టు సమాచారం.
కాగా ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా సత్తా చాటుతోంది.
అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడింది ప్రియాంక. ఆ తర్వాత కూడా కెరీర్ ఫుల్ జోష్ లో నడుస్తోంది.