బీజేపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు!

148
pouring petrol wife setting her on fire ..!

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బీజేపీ గిరిజన భరోసా యాత్ర లో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన గోడవలలో కార్యకర్తల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి.

ఇప్పటికే ఆ‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజాగా ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు బీజేపీ రాష్ట్ర నేతలు, గిరిజనులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 7న మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో 21మంది బీజేపీ నాయకులపై కేసు నమోదైంది.

ఖమ్మం జిల్లా కు చెందిన ఇద్దరు బీజేపీ నాయకులని అరెస్ట్ చేసి గురువారం రాత్రి రిమాండ్ కు తరలించారు.