మాస్ మహారాజా రవితేజ ఇటీవలే తన 68వ సినిమాను ప్రకటించారు.
‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేస్తున్నారు.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమా మార్చి ఫస్ట్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారట. అందులో ఒకరుగా ప్రియాంక ఆరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారట.
ఈ సంక్రాంతికి విడుదలైన “క్రాక్”’తో బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని మళ్లీ ఫామ్లోకి వచ్చిన రవితేజ త్వరలో “ఖిలాడి” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
“ఖిలాడి” మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.