కింద పడిపోయిన వింక్ బ్యూటీ… వీడియో వైరల్

309
Priya Prakash Varrier Falls On The Ground During Check Shooting

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కాలు జారి కింద పడిపోయిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను స్వయంగా ప్రియా పోస్ట్ చేసింది.

ప్రియా ప్ర‌కాశ్ ఈ రోజు నితిన్ హీరోగా నటించిన “చెక్” చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా సొష‌ల్ మీడియాలో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ “చెక్” సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఫ‌న్నీ ఇన్సిడెంట్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నప్పుడు ప్రియా పరిగెత్తుకుంటూ వ‌చ్చి నితిన్ భుజాల‌పైకి ఎక్కాల్సి ఉంటుంది. కాని బ్యాలెన్స్ త‌ప్పి కింద ప‌డిపోయింది.

దీంతో వెంటనే అప్ర‌మ‌త్త‌మైన యూనిట్ ప్రియాని పైకి లేపారు. ఆమెకు ఎలాంటి గాయలూ కాలేదు. దీనికి సంబంధించిన వీడియోను ప్రియా ప్ర‌కాశ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘చెక్’.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నేటి శుక్రవారం (ఫిబ్రవరి 26న) ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది ఈ మూవీ.