ఈ పిల్ల మళ్లీ కన్నుకొట్టిందిరా బాబోయ్..

627
priaya-prakash-eye-wink-nestle-ad

మలయాళ సినీభామ ప్రియా ప్రకాశ్ వారియర్ కేవలం ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయి, కోట్లమంది అభిమానులను తన వశం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఒరు ఆడార్ లవ్’ మూవీ కోసం కన్నుకొట్టిన ఈ చిన్నది మళ్లీ కన్నుగీటింది. అయితే ఈసారి సినిమా కోసం కూడా ఓ వ్యాపార ప్రకటన కోసం లైట్‌గా కన్నుకొట్టింది. యూట్యూబ్‌లో ఈ ప్రకటన ప్రసారమవుతోంది. 

నెస్లే చాక్లెట్ల కోసం ప్రియా ఇందులో నటించింది. సినిమా క్లిప్పులో కంటే కాస్త అందంగా కనిపించినా.. టార్గెట్ చాక్లెటే కనుక కన్నుకొట్టే సీన్లకు పెద్దగా ప్రాధాన్య ఇవ్వలేదు. అయినా యువత ఎగబడి చూశారు. కానీ సినిమాతో పోలిస్తే ఇదేమంత ఆకర్షణీయంగా లేకపోవడంతో తర్వాత వ్యూస్ తగ్గాయి.