పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్ ‘రాధేశ్యామ్’.
యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధలు భారీ బడ్జెట్‌తో “రాధేశ్యామ్” సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
జస్టిన్ ప్రభాకరన్ తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. జూలై 30న “రాధేశ్యామ్” విడుదలవుతోంది.
పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్’ రొమాంటిక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
అందులో ప్రభాస్ లుక్‌తో పాటు పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సెట్‌కి సంబంధించిన కొన్ని వివరాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఈ రైల్వే స్టేషన్, ట్రైన్ సెట్ కోసం భారీగా ఖర్చు చేశారట నిర్మాతలు. ఒక్క ట్రైన్ సెట్ కోసమే ఏకంగా 1.6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.
అంతేకాదు రియాలిటీకి దగ్గరగా ఉండేలా నిర్మించిన ఈ భారీ సెట్ కోసం దాదాపు 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట.
ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇలాంటి ఎన్నో సెట్‌లను నిర్మించారని సమాచారం.