నలుగురు ప్రముఖ నటీమణులు ప్రధాన పాత్రధారులుగా, నలుగురు ప్రముఖ టాలీవుడ్ దర్శకులు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “పిట్ట కథలు”. తాజాగా “పిట్ట కథలు” వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డిల దర్శకత్వంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందించిన అంథాలజీ సిరీస్ “పిట్ట కథలు”. ఈ సిరీస్ ను నాలుగు భాగాలుగా రూపొందించారు.
“పిట్ట కథలు”లో శృతి హాసన్, అమలాపాల్, ఈషా రెబ్బ, మంచు లక్ష్మి, సాన్వే మేఘన, జగపతి బాబు, సత్యదేవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
తాజాగా విడుదలైన “పిట్ట కథలు” సిరీస్ ట్రైలర్ చూస్తుంటే… మహిళా సాధికారతను, మహిళల సమస్యలు లాంటి అంశాలను ఈ సిరీస్‌లో బోల్డ్‌గా చర్చించినట్టు తెలుస్తోంది.
ఈ నెల 19 నుంచి “పిట్ట కథలు” సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.