చ‌మురు ధరలు తగ్గించడం సాధ్యమే: ఆర్‌బీఐ

381

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సామాన్యుడి వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ప్ర‌తి రోజూ పెర‌గ‌డం వ‌ల్ల సామాన్యుడి బ‌తుకు బండి క‌ష్టంగా సాగుతోంది.

దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై పలువురు ఆర్థికవేత్తలు సలహాలు, సూచ‌న‌లు ఇస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే చ‌మురు ధరల పెంపు విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. పన్నుల తగ్గిస్తే ఇందన ధరలు తగ్గించడం కష్టమేమీ కాదని చెప్పింది.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాలంటే, పన్నుల తగ్గించాల్సిన ఆవస్యకత ఉందని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.

ఇందన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పరోక్ష పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశంలో చ‌మురు ధరలు భారీగా పెరుగుతోన్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమ‌న్నారు.

కరోనా అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆదాయం, ప్రభుత్వ ఖర్చులను కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, వీటిని తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంద‌ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ హెచ్చ‌రించారు.

ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, చ‌మురు ధరల వల్ల రానున్న రోజుల్లో తయారీ, ఉత్పత్తి రంగంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

గడిచిన పది రోజులుగా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని.. కొన్ని రాష్ట్రాల్లో లీటరు రూ.100కు చేరువైనట్లు ఆయ‌న తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించకపోవడం వ‌ల్లే పెట్రోల్, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుత‌న్నాయ‌ని ఆయ‌న చెప్పారు.