ఆర్‌డీఎక్స్ ల‌వ్ టీజ‌ర్ విడుద‌ల‌

445
Rdx love teaser

ఆర్ఎక్స్ 100 మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌. తొలి చిత్రంతోనే కేక పుట్టించిన‌ ఈ అమ్మ‌డు తాజాగా ఆర్‌డీఎక్స్ ల‌వ్ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుదలైంది. ఇందులో డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌, హాట్ రొమాన్స్ యూత్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కూడా యూత్‌కి మంచి కిక్ ఇస్తుంద‌న‌డం టీజ‌ర్ బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు.శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం నాయిక ప్రాధాన్య‌త ఉన్న చిత్రంగా ఉంటుంద‌ని స‌మాచారం. తేజు కంచ‌ర్ల మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.సెప్టెంబ‌ర్‌లో చిత్ర విడుద‌ల‌కి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రోవైపు పాయ‌ల్ రాజ్ పుత్ న‌టించిన వెంకీ మామ‌, డిస్కోరాజా చిత్రాలు కూడా విడుద‌లకి సిద్ధంగా ఉన్నాయి.