పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా “ఉప్పెన” ట్రైలర్, కంటెంట్ ను వీక్షించారు. దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్ తేజ్, నిర్మాత రవిశంకర్ కలిసి ట్రైలర్ ను పవన్ కు చూపించారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “జానీ చిత్రంలో బాల నటుడిగా నటించాడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడు హీరోగా ఎదిగాడు.
‘ఉప్పెన’లో వైష్ణవ్ లుక్ ఆకట్టుకొనేలా ఉంది. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు.
మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు.
రంగస్థలం, దంగల్ లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువకాలం గుర్తుంటాయి.
ఉప్పెన కూడా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది” అని అన్నారు పవన్. చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.
‘మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు’ says Power Star @PawanKalyan after watching #Uppena content & wished the entire team good luck for the release.#UppenaFromTomorrow 🌊 pic.twitter.com/ELeBHDnHPE
— BARaju (@baraju_SuperHit) February 11, 2021
చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం “ఉప్పెన”.
ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
ఈనెల 12 భారీ ఎత్తున విడుదలవుతోన్న “ఉప్పెన” ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్రబృందం బిజీగా ఉంది.