అనసూయ ఫొటోతో పోస్టల్ స్టాంప్… హాట్ యాంకర్ ఎమోషనల్

240
Anasuya Gets Her Own Postal Stamp

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెరపై పలు షోలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే, మరోవైపు వెండితెరపై సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం అనసూయ పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనసూయ తన ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలు, తనకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా అనసూయకు అరుదైన గౌరవం దక్కింది. అనసూయ తన ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.

తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం అన‌సూయ‌ను గౌర‌విస్తూ ఆమె ఫొటోతో ఉన్న పోస్ట‌ల్ స్టాంప్‌తో స‌త్క‌రించింది.

“జీవితంలో ఇంతకు మించిన అపారమైన గౌరవం ఏం ఉంటుంది. నేను ఏం చేశానో తెలియ‌దు. నాకు ఈ గౌరవం ద‌క్కినందుకు సంతోషంగా ఉంది.

న‌న్ను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది.

మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అంటూ అన‌సూయ ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టింది.

ఈ సంద‌ర్భంగా అన‌సూయ తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. మార్చి ఎనిమిది నుంచి “తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం” ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది.