శ్రీ రెడ్డిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైబర్‌ క్రైమ్‌ కి ఫిర్యాదు

344
pawan kalyan complaint on sri reddy

గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలోను, ప‌లు టీవీ ఛానెల్స్ లోను టాలీవుడ్‌కి సంబంధించిన ప్ర‌ముఖుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న శ్రీరెడ్డిపై టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్ సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న శ్రీరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు ప‌వ‌న్‌. ఫిర్యాదు సేక‌రించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు త‌గిన ఆధారాలు సేక‌రించి న్యాయ నిపుణుల స‌ల‌హా మేర‌కు కేసు న‌మోదు చేసే అంశంపై నిర్ణ‌యం తీసుకోనున్నార‌ట‌. 

రీసెంట్‌గా శేఖ‌ర్ క‌మ్ముల‌పై ఇన్‌డైరెక్ట్‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది శ్రీరెడ్డి. దీనిపై ఫైర్ అయిన శేఖ‌ర్ క‌మ్ముల సీరియస్‌గా స్పందించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.’అంటూ శేఖ‌ర్ క‌మ్ముల హెచ్చ‌రించారు.

దీనిపై కూడా శ్రీరెడ్డి త‌న వాద‌న గ‌ట్టిగా వినిపించింది. చట్ట ప్రకారం వెళ్తావా? వెళ్లు, నాకేమైనా భయమా? నీవు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి, నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి?’ అంటూ ప్రశ్నించింది. సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలకు ఒకటే చెబుతున్నానని… తాను ఒంటరిని అయినప్పటికీ, తనకు కావాల్సినంత ధైర్యం ఉందని చెప్పింది. పోరాటానికి డబ్బులు అవసరం లేదని, గుండెలో ధైర్యం ఉంటే చాలని తెలిపింది.