“పైన పటారం” అంటూ అనసూయ ఐటమ్ సాంగ్… ప్రోమో విడుదల

162
Paina Pataram Video Song Promo from Chaavu Kaburu Challaga

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యంగ్ హీరో కార్తికేయ “చావు కబురు చల్లగా” అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.

యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో చిందేసింది.

“పైన పటారం” ఐటమ్ సాంగ్ లో మాస్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు హీరో కార్తికేయ, యాంకర్ అనసూయ సిద్ధమయ్యారు. ఆ మాస్ సాంగ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

అనసూయ ఐటం సాంగ్ ప్రోమో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ ప్రోమోను వీక్షించండి.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మై నేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు అనూహ్య స్పంద‌న ల‌భించింది.

ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని మార్చి19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.