టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫామ్ లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆఫీసర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా మొదటి ఆట కే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఏ మాత్రం ఆశాజనకంగా లేని టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని చెప్పొచ్చు.
కాగా సినిమా మొత్తం మీద మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో 25% వరకు మాత్రమె ఆక్యుపెన్సీ ని సాధించగా సినిమా ఫేట్ అక్కడే డిసైడ్ అయ్యింది అని చెప్పొచ్చు. అతి కష్టం మీద సినిమా కి మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అది కూడా ఫైనల్ కాలేదని, సినిమా రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల తో పోల్చితే బెటర్ గానే ఉన్నా ఎందుకనో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళే ధైర్యం చేయడం లేదనే చెప్పాలి. ఆ ప్రభావం ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పై స్పష్టంగా కనిపిస్తుంది.