నితిన్ 30వ సినిమా విడుదల తేదీ ఫిక్స్

171
Nithiin 30 to release on June 11th

యంగ్ హీరో నితిన్ బాలీవుడ్ లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న న‌భా న‌టేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. త‌మ‌న్నా భాటియా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు.

నితిన్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షరా వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది.

తాజాగా చిత్ర రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ను నితిన్ విడుద‌ల చేశారు. జూన్ 11న చిత్రం విడుద‌ల కానుంద‌ని తెలుపుతూ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నితిన్ ‌పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నారు.

కాగా నితిన్ ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం నితిన్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

నితిన్ న‌టించిన “రంగ్ దే” చిత్రం మార్చి 26న విడుద‌ల కానుండ‌గా, “చెక్” ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.