అన్యాయంపై కొట్లాడుదామంటే అరెస్ట్‌లు: విజ‌య‌శాంతి

177
KTR‌ False propaganda is atrocious: Vijayashanti

తెలంగాణ సర్కార్ పై బీజేపీ నేత విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను టీఆర్ఎస్ నెర‌వేర్చ‌ట్లేద‌న్నారు.

టీఆర్‌ఎస్ పరిపాలనా విధానంపై తెలంగాణ సమాజం తీవ్ర ఆందోళనలో ఉందని విజయశాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయశాంతి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

గుర్రంపోడు లాగా అన్యాయంపై కొట్లాడుదామంటే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు.

నిలదీసి ప్రభుత్వాన్ని ఏదైనా అడుగుదామనుకుంటే చట్టం తెలిసిన న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందన్నారు.

మంథని తీరుగా హత్యలు అవుతున్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని  చేసిన హామీ ఇప్పటికీ నీటి మూటలాగే ఉందని దుయ్యబట్టారు.

పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాల విషయంలోనూ ప్రభుత్వ తీరు బాగోలేదని విమర్శించారు. అన్నదాతలకు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయని ఆమె మండిపడ్డారు.