గుండెపోటుతో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మృతి

251
Kerala Music Director Issac Thomas Kottukapally passes away

ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయన గుండెపోటుతో చెన్నైలో తుది శ్వాస విడిచారు.

థామ‌స్ మృతిపై సినీ ఇండ‌స్ట్రీకు సంబంధించిన పలువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

థామ‌స్ మృతిపై కేరళ సాంస్కృతిక మంత్రి ఎకె బాలన్ సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు తీరనిది అంటూ మంత్రి ఎకె బాలన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన థామ‌స్ జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు.

భావం (2002), మార్గం (2003), సంచరం అండ్‌ ఒరిడామ్ (2004) అనే నాలుగు చిత్రాలకుగానూ ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు.

మన్ను ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన థామస్‌ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు.

కొడైకెనాల్‌లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు.