జ‌పాన్‌లో కొత్త ర‌కం వైర‌స్‌

249

క‌రోనా వైర‌స్ కొట్టిన దెబ్బ నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇప్ప‌డిప్పుడే కోలుకుంటున్నారు. అయితే జ‌పాన్‌లో మ‌రో కొత్త ర‌కం వైర‌స్ (E484K)ను గుర్తించారు.

అయితే ఇది యూకే, సౌతాఫ్రికా స్ట్రెయిన్ కంటే ప్రమాద‌మ‌ని జ‌పాన్ అధికారులు చెబుతున్నారు. ఇది క‌రోనా వైర‌స్ కంటే మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఈ వైర‌స్ సోకిన వారిని 93 మందిని గుర్తించిన‌ట్టు జ‌పాన్ అధికారులు తెలిపారు. తూర్పు జ‌పాన్‌లోని కాంటి ప్రాంతంలో 91 కేసుల‌ను, ఎయిర్‌పోర్ట్‌లో మ‌రో రెండు కొత్త ర‌కం చేసుల‌ను గుర్తించిన‌ట్టు ఆ అధికారులు శుక్ర‌వారం (19-2-2021) ప్ర‌క‌టించారు.

ఈ మ్యుటాంట్ ర‌కం వైర‌స్‌ను E484Kగా పిలుస్తున్నారు. ‘జపాన్‌లో అప్పుడప్పుడు క‌న‌బ‌డే ఇతర కొవిడ్‌ రకాల కంటే ఇది భిన్నంగా ఉంది. క‌ను ఇది వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉంటుందని భావిస్తున్నాం’ అని జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ పేర్కొంది.

పరివర్తనం చెందిన ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ల ద్వారా అదుపులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఆ దేశ పౌరులను అప్ర‌మ‌త్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొవిడ్ వ్యాక్సిన్‌ పనితీరును దెబ్బతీసే E484K పరివర్తనను ఈ కొత్త రకం కరోనా వైరస్‌లోనూ గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. దీనికి సంబంధించి టోక్యో ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఓ ఇన్ఫెక్షన్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్‌కు సంబంధించి పలు దేశాల్లో ఇప్పటికే 100కు పైగా ప‌రివ‌ర్త‌న‌ల‌ను గుర్తించారు. కానీ కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటివరకు వెల్లడైన రకాల కంటే ఈ కొత్త వైరస్‌ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. జపాన్‌లో కేసుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉందని అక్కడి అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

జపాన్‌లో వారం రోజుల కిందటే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టీకాలు వచ్చేశాయని అక్కడి ప్రజలు ఆనందప‌డుతున్న స‌మ‌యంలో ఈ కొత్త వైర‌స్ వార్త ప్ర‌పంచ వ్యాప్తంగా అందరినీ క‌ల‌వ‌ల‌పెడుతోంది.

ఈ కొత్త వైరస్ వేరియంట్ వార్తల నేపథ్యంలో యూరప్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.