
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుత్రుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. గురువారం (18-2-2021) జరిగిన ఐపీఎల్ వేలం పాటలో అర్జున్‌ను ముంబై ఇండియన్స్ జట్టు అతని బేస్ ప్రైజ్‌కే కొనుగోలు చేసింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న అర్జున్ సోదరి శారా టెండూల్కర్ తన సోదరిడిని అభినందిస్తూ ఉద్వేగ భరితమైన మెసేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
‘ క్రికెట్ అనేది నీ రక్తంలోనే ఉంది. నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవ్వరూ దూరంచేయలేరు. ఇన్నాళ్లూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి ఉన్నతమైన క్రికెటర్‌గా మారావు.
ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్ సృష్టించడానికి నా తమ్ముడు సిద్ధంగా ఉన్నాడు’ అని శారా పేర్కొంది.
దీంతో పాటు అర్జున్ బౌలింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. అర్జున్ టెండూల్కర్ ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ ఉపయోగపడతాడని అతడిని జట్టులోకి తీసుకున్నామని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని అకాశ్ అంబానీ అన్నారు.
అర్జున్ ఇటీవల ముంబై సీనియర్స్ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాడు. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.