ఆడదంటే అబల కాదు సబల అని ఓ మహిళ నిరూపించింది. కింగ్ పిన్ అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యాడు.
ఇటీవలే బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఆంటీల వ్యామోహంతో అనవసరంగా భార్యతో గొడవ పెట్టుకున్నాడు.
మళ్లీ కటకటాలపాలయ్యాడు. త్రాగుడు, డ్రగ్స్‌కు బానిసైన ఇతను బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి మహా నగరాల్లో ఎంజాయ్ చేస్తూ డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడు.
భార్యతో గొడవ కారణంగా జైలుకు వెళ్లాడు. స్యాండిల్ వుడ్ లో కలకలం బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు కరోనా (COVID-19) కాలంలోనూ కలకం రేపిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో స్యాండిల్ వుడ్ అందాల భామలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీతో పాటు కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు జైలుకు వెళ్లారు. ఈ కేసులోనే కింగ్ పిన్ కూడా జైలుకి వెళ్లి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు.
బెయిల్ మీద బయటకు వచ్చిన రెండు మూడు రోజులు కింగ్ పిన్ మామూలుగానే ఉన్నాడు. కానీ ఈ నెల 12వ తేదీన కింగ్ పిన్ తన ప్రతాపాన్ని భార్య పూజా గాంధీపై చూపించాడు.
ఆమెకు అక్రమ సంబంధం ఉందన్న కారణంగా ఇంటిని నుంచి బయటికి తరిమేశాడు. అంతేకాదు ఆ కారణంతోనే జైల్లో ఉన్న తనకు కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ప్రయత్నించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆగ్రహం ఊగిపోయిన కింగ్ పిన్ తన భార్యను చితకబాదినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తన భర్తకు ఫైనాన్స్ వ్యాపారం ఉందని.. మల్లేశ్వరంలో వ్యాపారం చేస్తూ గీతా, బిందు అనే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కింగ్ పిన్ భార్య పూజా ఆరోపించింది.
ఆ కారణంగానే తనను, పిల్లలను ఇంటి నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నాడని ఆమె వయ్యాలికావల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కింగ్ పిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మళ్లీ జైలుకు పంపారు.
కింగ్ పిన్ ఒకవైపు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూనే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని పోలీసులు అంటున్నారు.