ఉగ్ర‌వాదుల దాడి

203

దేశం కోసం మ‌రికొంత మంది జ‌వాన్లు ప్రాణ‌త్యాగం చేశారు. శ్రీ‌న‌గ‌ర్‌లోని భ‌గ‌త్ భ‌ర్జుల్లాలో పోలీసుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు చేశారు.

ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పోలీసులు అమ‌రుల‌య్యారు. ఉగ్ర‌వాదులు అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌ర‌ప‌డంతో పోలీసులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

ఈ ఘ‌ట‌న‌తో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు పాల్గొన్న‌ట్టు గుర్తించారు. శ్రీ‌న‌గర్ ఎయిర్‌పోర్ట్ విధుల్లో ఉన్న పోలీసు బ‌ల‌గాల‌ను ఈ ఉగ్ర‌వాదులు ల‌క్ష్యంగా చేసుకున్నారు.

టీఆర్ఎఫ్ అనే ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన స‌భ్యులు ఈ దాడికి పాల్పిడిన‌ట్టు తెలుస్తోంది. కాల్పులు జ‌రిగిన ఉగ్ర‌వాదిని సాకిబ్ మంజూర్‌గా గుర్తించారు.

దాడికి పాల్ప‌డ్డ ఉగ్ర‌వాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ జ‌రుగుతోంది. మ‌రోవైపు ఉద‌యం షోపియాన్ జిల్లా బ‌డిగాం ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.

భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఘ‌ట‌న జ‌రిగిన స్థ‌లం నుంచి ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

కాగా జ‌మ్మూకాశ్మీర్‌లో మ‌రో ఉగ్ర‌స్థావ‌రం గుట్టుర‌ట్ట‌యింది. రియాసి జిల్లాలో ఉగ్ర‌వాద స్థావ‌రాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి.

ఏకే-47, ఎల్‌ఎల్‌ రైఫిల్‌, 303 బోల్ట్ రైఫిల్‌ స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా ఘ‌ట‌న జ‌రిగి రెండేళ్లు పూర్త‌యిన ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే మ‌రో ఉగ్ర కుట్ర‌ను భ‌గ్నం చేశారు.

జమ్ముకశ్మీర్‌ బస్టాండ్‌లో 7 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.